కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో లోక్ సత్తా, ప్రజారాజ్యం లాంటి కొత్త రాజకీయ శక్తులు వచ్చాయి. అంతా బాగానే ఉంది. వార్తాపత్రికలు తమ ధోరణిలో కథనాలను వండి వారుస్తున్నాయి. సునిశిత విశ్లేషణా, సాధికారిక విమర్శా మాత్రమే లోపించాయి.
తెలుగులో సరైన రాజకీయ మ్యాగజీన్లు లేకపోవటమే దీనికి కారణం.
౩౦ ఏళ్ళ క్రితం కమెండో, ఆ తర్వాత ఎన్ కౌంటర్... ఆ వరుసలో ఎన్నో రాజకీయ మ్యాగజీన్ల వెల్లువ సాగింది. ఎన్టీఆర్ పాలనా కాలం కార్టూనిస్టులకే కాదు, తెలుగు రాజకీయ పీరియాడికల్స్ కే స్వర్ణయుగం! ఇప్పుడంతా క్షీణయుగం...
ఎడిటర్ అనుభవాలు
‘కమెండో’లో ఎడిటర్ నాగరాజు తన అనుభవాలను చివరి పేజీలో ధారావాహికగా రాసేవారు. ఈ శీర్షిక పేరుకు తగ్గట్టుగా రాజకీయనాయకుల మంచి చెడులను ఆవిష్కరించింది.
లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, నీలం సంజీవరెడ్డి మొదలైన గొప్ప నాయకులతో సాన్నిహిత్యం ఉన్న ఎడిటర్ వాటికి ఆసక్తికరంగా ఈ ధారావాహికలో అక్షరరూపమిచ్చారు.
కిందటి ఏడాది జనవరి ‘కమెండో’లో ప్రచురించిన పేజీని పైన చూడండి.